హైడ్రా కూల్చివేతలపై MP ఈటల సీరియస్ కామెంట్స్

by Gantepaka Srikanth |
హైడ్రా కూల్చివేతలపై MP ఈటల సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కూకట్‌పల్లి నల్లచెరువులో హైడ్రా(Hydra) కూల్చివేతల ప్రాంతాన్ని ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajendar) పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. బుల్డోజర్లతో షెడ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు.

చెరువులు కాపాడాలంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు భూములు లెక్కించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు భూములకు పరిహారం చెల్లించి.. చెరువులను కాపాడాలని ప్రభుత్వానికి ఈటల రాజేందర్ సూచించారు. అంతేకాదు.. కూల్చివేతలతో రోడ్డున పడ్డ పేదలకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు ఉన్నాయని, అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి జాగీరు కాదన్నారు. చెరువులు, వాగుల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed