Ponnam: మంత్రి పొన్నంకు మోడల్ స్కూల్ విద్యార్ధుల ధన్యవాదాలు

by Ramesh Goud |
Ponnam: మంత్రి పొన్నంకు మోడల్ స్కూల్ విద్యార్ధుల ధన్యవాదాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హనుమకొండ జిల్లా పర్యటనకు వెళ్లి వస్తున్న తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మార్గమధ్యంలో మోడల్ స్కూల్ విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంకు విద్యార్ధులు అభినందనలు తెలియజేశారు. పలు కార్యక్రమాల్లో భాగంగా కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ హనుమకొండ జిల్లాలో పర్యటించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో గోపాల్ పూర్ నుంచి ఎల్కతుర్తి వెళుతూ మార్గమధ్యంలో రోడ్డు మీద ఉన్న బస్సు కోసం వేచి చూస్తున్న ఎల్కతుర్తి మోడల్ పాఠశాల విద్యార్ధులను చూసి కారు ఆపారు. వారితో వెళ్లి ముచ్చటించారు.

గతంలో మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక బస్సులు అడిగినపుడు విద్యార్థుల సమయానికి రెండు బస్సులు వేయడంతో సమస్య తీరిందని విద్యార్ధులు మంత్రికి తెలిపారు. బస్సులు ఏర్పాటు చేసిన పొన్నంకు విద్యార్ధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో పొన్నం మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకోవాలని, స్కూల్ లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక త్వరలోనే మోడల్ స్కూల్ ను సందర్శిస్తానని మంత్రి తెలిపారు.





Next Story