- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల పై ఎమ్మెల్యే జీఎంఆర్ ఫైర్..
దిశ, పటాన్ చెరు : పటాన్ చెరు కేంద్రంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాళకు భద్రత కల్పించాలని పోలీసులను కోరితే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కానిస్టేబుల్ ను సైతం పంపించలేదని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక పోలీసుల పై ఫైర్ అయ్యారు. సోమవారం పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితమే సంబంధిత శాఖ అధికారులు భద్రత కల్పించాలని పోలీసులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్నారని.. ఈ రోజు ఉదయం సైతం భద్రత పై పోలీసులను సంప్రదించినప్పటికిని స్పందించకపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని 26 మండలాల నుంచి 500 మంది బాలికలు, 500 మంది బాలురు క్రీడోత్సవాలకు హాజరవుతున్న సమయంలో.. ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల పై లేదా అని ప్రశ్నించారు. వారం రోజుల పాటు జరగనున్న క్రీడోత్సవాల్లో ఎటువంటి సంఘటన జరిగిన స్థానిక డీఎస్పీ, సీఐలదే బాధ్యత అన్నారు. ఈ అంశం పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.