Ap Fluds : వరద బాధితులకు ప‌రిహారం ప్రకటన.. ఉత్తర్వులు జారీ

by srinivas |
Ap Fluds : వరద బాధితులకు ప‌రిహారం ప్రకటన.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వరద బాధితుల(Flood Victim)కు ప్రభుత్వం ప‌రిహారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ (Vijayawada)లో బుడమేరు (Budameru) పొంగి వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో బాధతులు సర్వం కోల్పోయారు. నీళ్లన్నీ నీట మునిగాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వారికి ప్రభుత్వం (Government) సాయం ప్రకటించింది. ఇళ్ళు, పంటలు, వ్యాపారాలు, ఉపాధి, పరిశ్రమలు, పశువులు, కోళ్ళు, వాహనాలకు జరిగిన నష్టానికి సాయం అందించనుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బాధితులకు రూ.25 వేలు, ఫస్ట్ ఫ్లోర్ ఆ పైన ఉన్న బాధితులకు రూ.10 వేల సాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) ఇప్పటికే ప్రకటించారు. కిరాణా, రెస్టారెంట్ వంటి చిన్న తరహా వ్యాపారులకు రూ.25 వేల సాయం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు చిన్న తరహా పరిశ్రమలు, టూవీలర్లకు పరిహారం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరదల వ‌ల్ల నష్టపోయిన వారికి రూ.10 వేలు, పంటల వారీగా రూ.35 వేల నుంచి రూ.1500 వరకు ప‌రిహారం అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

Most Viewed