Mutual Fund Industry: 5 కోట్ల మార్కు దాటిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు

by S Gopi |
Mutual Fund Industry: 5 కోట్ల మార్కు దాటిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమ 5 కోట్ల ఇన్వెస్టర్ల మైలురాయిని చేరుకుంది. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండటం, ఎంఎఫ్ పరిశ్రమలో కొత్త ఫండ్ ఆఫర్లు పెరగడం ఇందుకు దోహదపడిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గడిచిన 10 నెలల్లోనే కొత్తగా కోటి మంది ఇన్వెస్టర్లు ఎంఎఫ్ విభాగంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. గతంలో పరిశ్రమ కోటి మంది పెట్టుబడిదారులను చేరేందుకు 21 నెలలు పట్టగా, 2 కోట్ల నుంచి 4 కోట్లకు చేరేందుకు 26 నెలల సమయం మాత్రమే పట్టింది. ఈక్విటీ పెట్టుబడులు పెరగడం వల్లనే ఎంఎఫ్‌లో కొత్త ఇన్వెస్టర్లు వేగంగా చేరుతున్నారని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దేశంలో దీర్ఘకాలానికి పెట్టుబడులకు విశ్వాసం పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లతో పాటు మూలధన మార్కెట్లలోనూ పెట్టుబడిదారులు సొమ్ము పెట్టాలని ఆశిస్తున్నామని మిరే అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్(ఇండియా) సీఈఓ స్వరూప్ ఆనంద్ మొహంతి అన్నారు. ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గడిచిన ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఫండ్ పరిశ్రమ కొత్త ఫండ్ ఆఫర్లు తీసుకొచ్చింది. దానివల్ల గత నాలుగు నెలల్లో పరిశ్రమ ఏకంగా రూ. 48,735 కోట్లను సేకరించాయని ఎస్‌బీఐ ఎంఎఫ్ జాయింట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) డీపీ సింగ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed