- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MobiKwik IPO: రూ. 700 కోట్ల మొబిక్విక్ ఐపీఓకు సెబీ అనుమతి
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ మొబిక్విక్ త్వరలో ఐపీఓకు సిద్ధమవుతోంది. తాజాగా సోమవారం కంపెనీ రూ. 700 కోట్ల విలువైన ప్రారంభ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 4న మొబిక్విక్ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా వచ్చే నిధులతో కంపెనీ ఆర్థిక సేవలు, పేమెంట్ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) వంటి విభాగాల్లో ఖర్చుల కోసం వినియోగించనున్నట్టు కంపెనీ వివరించింది. ఆర్థిక సేవల కోసం రూ. 250 కోట్లు, పేమెంట్ సర్వీసెస్ రూ. 135 కోట్లు, డేటా, ఏఐ, ఎంఎల్, ప్రోడక్ట్ టెక్నాలజీలో రూ. 135 కోట్లు, చెల్లింపుల పరికరాలకు రూ. 70.28 కోట్లను వాడనున్నట్టు తెలిపింది. ఐపీఓ మొత్తం పూర్తిగా కొత్త ఇష్యూ ఉంటుందని ఆఫర్ ఫర్ సేల్ ఉండదని కంపెనీ పేర్కొంది. గురుగ్రాం కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న మొబిక్విక్ తొలుత 2021లో రూ. 1,900 కోట్లను సేకరించే లక్ష్యంతో డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. ఆ తర్వాత మార్కెట్లలో పరిణామాలు ప్రతికూలంగా ఉండటంతో ఐపీఓ మొత్తాన్ని తగ్గించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కంపెనీ మొత్తం 14.7 కోట్ల వినియోగదారులు, 38.1 లక్షల మంది వ్యాపారుల భాగస్వామ్యాన్ని మొబిక్విక్ కలిగి ఉంది.