Akshay Shinde : బద్లాపూర్ లైంగిక దాడి ఘటన.. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం

by vinod kumar |
Akshay Shinde : బద్లాపూర్ లైంగిక దాడి ఘటన.. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో ఇద్దరు స్కూల్ విద్యార్థులపై గత నెలలో లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన అక్షయ్ సోమవారం పోలీసుల కాల్పుల్లో మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలోజా జైలులో ఉన్న అక్షయ్ షిండేను ప్రొడక్షన్ వారెంట్ ఆధారంగా థానే క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది. అనంతరం విచారణ నిమిత్తం బద్లాపూర్ తీసుకెళ్తుండగా.. వాహనం ముంబ్రా బైపాస్ సమీపంలోకి రాగానే నిందితుడు ఓ పోలీస్ అధికారి నుంచి తుపాకీ లాక్కుని రెండు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా అక్షయ్‌పై ఎదురు కాల్పులు జరిపారు. తీవ్రగాయాల పాలైన నిందితుడిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. కాగా, బద్లాపూర్‌లోని స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న అక్షయ్ షిండే మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది. ఈ కేసును విచారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే అక్షయ్‌ను గత నెల 17న అరెస్టు చేశారు.

Next Story