టీటీడీ ఎఫెక్ట్ : భద్రాచలం ప్రసాదాలకు వినియోగించే సరుకుల శాంపిల్స్ సేకరణ

by Kalyani |
టీటీడీ ఎఫెక్ట్ : భద్రాచలం ప్రసాదాలకు వినియోగించే సరుకుల శాంపిల్స్ సేకరణ
X

దిశ, భద్రాచలం : టీటీడీ నెయ్యి కల్తీ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రసాదాలు, అన్నదానానికి వినియోగించే సరుకుల నాణ్యత పై రామాలయం అధికారులు దృష్టి పెట్టారు. భద్రాచలం రామాలయంలో స్టోర్స్ విభాగంలో ప్రసాదాలు, అన్నదాననికి ఉపయోగించే సరుకులను ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ నిమిత్తం ఈవో రమాదేవి లేఖ రాయగా ఫుడ్ ఇన్స్పెక్టర్ సోమవారం శాంపిల్స్ సేకరించారు. ప్రసాదాలకు వాడే సరుకులను సేకరించి ల్యాబ్లో పరీక్ష నిమిత్తం తీసుకు వెళ్లడం జరిగింది.

Next Story