- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Maharashtra elections : మహారాష్ట్ర ఎన్నికల వేళ బ్యాగ్ చెకింగ్ వివాదం.. ఠాక్రేకు బీజేపీ కౌంటర్
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ఎన్నికల (Maharashtra elections) దగ్గరపడుతుండటంతో.. పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రతిపక్ష నేతలకు సంబంధించిన బ్యాగులు, ఇళ్లలోనే తనిఖీలు నిర్వహిస్తారని ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బ్యాగ్‌లను భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన దృశ్యాలను షేర్ చేసింది. నవంబర్ 5న కొల్హాపుర్, నవంబర్ 7న యవత్మాల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఫడ్నవీస్ (Devendra Fadnavis) బ్యాగ్‌లను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ‘‘ఆ తనిఖీ గురించి ఫడ్నవీస్ ఎలాంటి విమర్శలు చేయలేదు. రాజ్యాంగ కాపి తీసుకెళ్లడం కాదు.. రాజ్యాంగపరమైన నిబంధనలనూ అనుసరించాలి. ప్రతి ఒక్కరు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని కోరుతున్నాం. కొందరికి ప్రతిదాన్ని సమస్యగా మార్చడం, బహిరంగంగా విమర్శించడం అలవాటు’’ అని బీజేపీ మండిపడింది.
ఉద్ధవ్ ఠాక్రే ఆరోపణలు
ఇకపోతే, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం యవత్మాల్‌కు వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) బ్యాగ్‌ని తనిఖీ చేశారు. దీంతో, ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రతిపక్షపార్టీ నేతల ఇళ్లు, బ్యాగ్‌లు, హోటళ్లు, హెలికాప్టర్లను మాత్రమే ఈసీ అధికారులు తనిఖీ చేస్తున్నారని.. అధికార కూటమికి చెందిన నాయకుల విషయంలో నిబంధనలు పాటించరని ఆరోపించారు. ప్రధాని మోడీ(PM Modi), కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) లాంటి నేతల హెలికాప్టర్లు ఎప్పుడైనా తనిఖీ చేశారా? అని ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. ఈ విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) స్పందించారు కూడా. అసెంబ్లీ ఎన్నికల(Maharashtra elections) దృష్ట్యా ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని పార్టీల నేతల హెలికాప్టర్‌లను తనిఖీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇకపోతే, నవంబర్ 20న మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.