- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూఏఈలోనే తొలి హిందూ దేవాలయం.. 14న ప్రారంభించనున్న మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు గాజా - ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడానికి అరబ్ దేశాలు దౌత్యం నెరుపుతుండగా.. మరోవైపు అత్యంత సంపన్న దేశం యూఏఈలో ఈనెల 13, 14 తేదీల్లో పర్యటించేందుకు ప్రధాని మోడీ రెడీ అయ్యారు. యూఏఈతో భారత్ సంబంధాలు బలోపేతమవుతున్న తీరుకు గత పదేళ్లలో ప్రధాని మోడీ చేసిన పర్యటనలే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. ఈసారి పర్యటనలో భాగంగా దుబాయ్‌లోనే తొలి హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న అబుధాబిలో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అదే రోజున దుబాయ్‌లో జరిగే ‘ప్రపంచ ప్రభుత్వ సదస్సు’కు ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ‘ప్రపంచ ప్రభుత్వ సదస్సు’లో భారత ప్రధాని మోడీకి యూఏఈ ఈ అవకాశాన్ని కల్పించడం ఇది రెండోసారి. 2015 ఆగస్టు నుంచి ఇప్పటివరకు యూఏఈలో ప్రధాని మోడీ ఏడుసార్లు పర్యటించారు. చివరగా 2023 డిసెంబరులో యూఏఈలో జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సు ‘కాప్28’లోనూ భారత ప్రధాని పాల్గొన్నారు. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా యూఏఈతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై భారత్ ఫోకస్ పెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా, గాజా - ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు, ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు ఖతర్, ఈజిప్టు దేశాలు దౌత్యం జరుపుతున్నాయి.