Aurai : విరాళాలతో బాగ్మతి నదిపై వంతెన.. ఆరాయ్ గ్రామస్తుల ఐకమత్యం

by Hajipasha |
Aurai : విరాళాలతో బాగ్మతి నదిపై వంతెన.. ఆరాయ్ గ్రామస్తుల ఐకమత్యం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఏటా వర్షాలు, వరదలకు ఆ ఊరు జల వలయంలో చిక్కుకొని విలవిలలాడేది. ఊరి చెంతన ప్రవహించే బాగ్మతి నదిని దాటేందుకు స్థానికులు పడవలు, తెప్పలను వాడాల్సి వచ్చేది. ఈవిషయం తెలిసినా గత కొన్ని దశాబ్దాలుగా బిహార్‌(Bihar)ను పాలించిన ప్రభుత్వాలు స్పందించలేదు. బాగ్మతి నదిపై ఉన్న వంతెన కూలిపోయిందని, కొత్త వంతెన నిర్మించాలనే ఆరాయ్(Aurai) గ్రామస్తుల (ముజఫర్‌పూర్ జిల్లా) డిమాండ్‌ను పట్టించుకోలేదు.

దీంతో విసిగి వేసారిపోయిన ఊరి ప్రజలు తలా కొంత విరాళాలు వేసుకొని బాగ్మతి నదిపై కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి దాన్ని ప్రారంభించుకున్నారు. ఈ వంతెనను ‘చాచ్రీ బ్రిడ్జ్’ అని పిలుస్తారు. దాదాపు 3వేల జనాభా ఉన్న ఆరాయ్ గ్రామం నుంచి ముజఫర్‌పూర్(Muzaffarpur) జిల్లా కేంద్రానికి రోడ్డు మార్గం కూడా ఉంది. అయితే తాజాగా బాగ్మతి నదిపై నిర్మించిన వంతెన మీదుగా వెళితే ప్రయాణ దూరం దాదాపు 20 కి.మీ మేర తగ్గిపోతుంది.

Advertisement

Next Story