అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత

by srinivas |
అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత
X
  • భారత్‌లో 500 మంది ఎంప్లాయిస్ ఇంటికి
  • ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులు షాక్

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో లే ఆఫ్‌లో సీజన్ కంటిన్యూ అవుతోంది. మరోసారి భారీ సంఖ్యలో సంస్థ ఉద్యోగులను తొలగించింది. అంతర్జాతీయంగా తమ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 9,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లు ఇప్పటికే అమెజాన్ ప్రకటన చేయగా అందులో భాగంగా తాజాగా భారత్ లో 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

వెబ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, పోర్ట్ డిపార్ట్ మెంట్‌లో సేవలు అందిస్తున్న ఎంప్లాయిస్‌ను తాజా లే ఆఫ్‌లో ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యం పరిస్థితులు, ఆదాయం తగ్గే సంకేతాలు.. మొదలైన అంశాల కారణంగా ఈ లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నట్లు గతంలో అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ వివరించారు. కరోనా సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న అమెజాన్.. ఇప్పుడు ఆ ఉద్యోగులను స్ట్రీమ్ లైన్ చేస్తోంది.

మాంద్యం పరిస్థితుల కారణంగా పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఉద్యోగుల నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. చాలా కంపెనీలు వ్యయాలను నియంత్రించుకునే మార్గంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇదే బాటులో పయనిస్తున్నాయి.

Advertisement

Next Story