- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
22 మంది అభ్యర్థులతో కెప్టెన్ అమరీందర్ మొదటి జాబితా
చండీగఢ్: పంజాబ్ ఎన్నికల బరిలోకి మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అభ్యర్థులను ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్(పీఎల్సీ) తరుఫున 22 మంది అభ్యర్థులతో కూడిన ఆదివారం విడుదల చేశారు. ఆయన పాటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. కెప్టెన్ ఇప్పటికే బీజేపీ, శిరోమణి ఆకాలీదళ్(సన్యుక్త్)లతో పొత్తు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. మొత్తంగా 37 స్థానాల్లో కెప్టెన్ పార్టీ పోటీ చేయనుండగా, మరో ఐదు అసెంబ్లీ స్థానాల కూడా తీసుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయి.
ఇక తాజా జాబితాలో ఎనిమిది మంది జాట్ సిక్కులు, నలుగురు ఎస్సీ, ముగ్గురు బీసీ, ఐదుగురు హిందూ వర్గానికి చెందిన వారికి చోటు కల్పించడం గమనార్హం. మొత్తంగా 37 స్థానాలకు గాను అధికంగా 26 మంది అభ్యర్థులు మల్వా ప్రాంతం నుంచి ఉన్నారు. మరో ఏడుగురు అభ్యర్థులు మాఝా ప్రాంతం, నలుగురు దోబా ప్రాంతం నుంచి ఎంచుకున్నారు. మొదటి జాబితాలో మహిళకు కూడా చోటు కల్పించారు. 117 స్థానాలున్న పంజాబ్ వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి.