Amarasuriya: శ్రీలంక ప్రధానిగా మరోసారి అమరసూర్య.. ప్రకటించిన అధ్యక్షుడు దిసనాయకే!

by vinod kumar |
Amarasuriya: శ్రీలంక ప్రధానిగా మరోసారి అమరసూర్య.. ప్రకటించిన అధ్యక్షుడు దిసనాయకే!
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక ప్రధాన మంత్రిగా మరోసారి హరిణి అమరసూర్య (Harini Amarasuriya) నియామకమయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 225 మంది సభ్యులకు గాను అధ్యక్షుడు దిసనాయకే (dishanayake) నేతృత్వంలోని వామపక్ష కూటమి 159 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రి వర్గాన్ని సోమవారం నియమించారు. పీఎంగా హరిణికి అవకాశం ఇవ్వగా..విదేశాంగ మంత్రిగా సీనియర్ నేత విజితా హెరాత్‌(Vijitha herath)ను తిరిగి నియమించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు జేవీపీ నేత కేడీ లలకంట ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. రక్షణ, ఆర్థిక శాఖ వంటి కీలక పోర్ట్ ఫోలియోలు దిసనాయకే వద్దే ఉంచుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, సెప్టెంబర్‌లో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్(NPP) అలయన్స్ తరపున పోటీ చేసిన అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. ఆ సమయంలో ఎన్‌పీపీకి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉండడంతో పార్లమెంట్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. తాత్కాలిక ప్రధానిగా అమరసూర్యను నియమించారు. అనంతరం లంక పార్లమెంటుకు ఎన్నికలు జరగగా ఎన్‌పీపీ మెజారిటీ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలోనే హరిణిని మరోసారి ప్రధానిగా నియమించారు. దీంతో ఆమె శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement

Next Story