- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చీఫ్ కన్నుమూత
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎమ్‌పీఎల్‌బీ) ప్రెసిడెంట్ మౌలానా రబే హస్నీ నద్వీ(94) గురువారం తుదిశ్వాస విడిచారు. మౌలానా రబే హస్నీ నద్వీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. న్యుమోనియా, శ్వాసకోశ సమస్యలు బాధించడంతో ఆయనను చికిత్స నిమిత్తం రాయ్‌బరేలి నుంచి లక్నో తరలించారు. ఈ క్రమంలో లక్నోలోని దలీగంజ్‌లోని నద్వా మదర్సాలో నద్వీ మరణించారు. కాగా, ఆయన మతపరమైన అంశాల్లో సమాజానికి మార్గదర్శనం చేసేవారు. ముస్లింలు ఇస్లాం మతాన్ని కేవలం నమాజ్‌కే పరిమితం చేశారని, సామాజిక విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ సందర్భంలో ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇస్లాం కేవలం ప్రార్థనకే పరిమితం కాకూడదని ఆకాంక్షించారు. మౌలానా రబే హస్నీ నద్వీ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story