ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలి: బ్రిక్స్‌ సమావేశంలో మోడీ

by Mahesh |
ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలి: బ్రిక్స్‌ సమావేశంలో మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) బ్రిక్స్‌ సమావేశం(BRICS meeting)లో ప్రసంగించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్‌ సమావేశాన్ని పుతిన్(Putin) విజయవంతంగా నిర్వహించారని అన్నారు. అలాగే భవిష్యత్‌లో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందని ఆశాబావం వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై బ్రిక్స్ దృష్టి పెట్టాలని, ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టామని..సమావేశంలో తెలిపారు. ఆయా దేశాలకు ఉగ్రవాదం(terrorism)పై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదని, ఉగ్రవాద మహమ్మారిపై అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. చివరగా బ్రిక్స్ లోని అన్ని దేశాలు తమ తమ లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేసుకోవడాన్ని ప్రోత్సహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కాగా 16 వ బ్రిక్స్ సమావేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన రష్యాలోని కజాన్ నగరంలో జరిగాయి.

Advertisement

Next Story