అనంత్ అంబానీ మ్యారేజ్ వేళ స్టార్ హీరోకు కరోనా పాజిటివ్

by Prasad Jukanti |
అనంత్ అంబానీ మ్యారేజ్ వేళ స్టార్ హీరోకు కరోనా పాజిటివ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం శుక్రవారం అట్టహాసంగా జరగనున్నది. మరికాసేపట్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లు వివాహం బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు దేశ, విదేశాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ముంబయికి తరలి వస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన తారలు ఈ పెళ్లి వేడుకల్లో హాజరు అవుతున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అంబాని ఇంట జరుగుతున్న ఈ మ్యారేజ్ వేడుకను మిస్ కాబోతున్నారు. ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. తాజాగా ఆయన నటిస్తున్న 'సర్ఫిరా' సినిమా ప్రమోషన్ లో పాల్గొనేందుకు ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్యపరీక్షలు నిర్వహించుకోగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు సూచనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.


శోభితా ధూళిపాళ ఇన్‌స్టా పోస్ట్‌పై నాగచైతన్య రియాక్షన్ ఇదే.. షాక్‌లో నెటిజన్లు



Next Story