రావణున్ని దేవునిగా పూజించే జిల్లా ఇదే.. ఎత్తైన విగ్రహం కూడా

by Seetharam |   ( Updated:2022-10-06 09:29:23.0  )
రావణున్ని దేవునిగా పూజించే జిల్లా ఇదే.. ఎత్తైన విగ్రహం కూడా
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రజలందరి దృష్టిలో రావణుడు ఒక రాక్షసుడు, చెడు బుద్ధి కలవాడు.. శ్రీరాముడి నుంచి సీతను వేరు చేసిన దౌర్భాగ్యుడు అని భావిస్తారు. అంతేకాదు రావణుడిని రాక్షసుడిగా దేశమంతటా కోడై కూస్తుంది. ప్రతీ ఏటా దసరా పండగ రోజు రావణ దహణం చేసి సంబరాలు చేసుకుంటుంటారు. అయితే దేశం మొత్తం మీద రావణున్ని రాక్షసుడిగా చూసే వారే ఉన్నారు. కానీ, అతడిని దేవునిగా పూజించే భక్తులు కూడా ఉన్నారంటే నమ్ముతారా?. అవునండీ నిజమే.. ఆ ప్రాంతంలో రావణ దహనం కూడా నిర్వహించరు. అయితే రావణాసురుడు రాక్షసుడు కదా! ఆయన్ని ఎందుకు పూజిస్తారు అనే సందేహం రావచ్చు. అయితే ఎందుకు అలా చేస్తారో, ఎక్కడ చేస్తారో తెలుసుకుందాం.

ఎక్కడ చేస్తారు

మహారాష్ట్రలోని అకోలా జిల్లా సంగోలా గ్రామంలో రావణున్ని గొప్ప దేవునిగా పూజిస్తారట. దసరా రోజు దేశమంతటా రావణ దహనం చేస్తే.. ఈ ప్రాంతంలో మాత్రం హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు.. ఆ గ్రామం మధ్యలో 10 తలలతో రావణుడి ఎత్తైన విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అయితే దాదాపు కొన్ని శతాబ్దాల నుంచి ఆ విగ్రహానికి పూజలు చేసి ఆనందాంగా జీవిస్తున్నారు. ఇక ఆ విగ్రాహాన్ని చూడటం కోసం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు.

ఎందుకు చేస్తారు

ఆ ప్రాంతంలో నివశించే ప్రజలు కేవలం రావణుడి దయ వల్లనే సంతోషంగా జీవిస్తున్నామని. ఆ లంకా రాజు ఆశీర్వాదంతోనే తమకు జీవనోపాధి కలిగిందని భావిస్తారట. ఆ ప్రాంతం మొత్తం సంతోష జీవితం గడపడానికి ఆయనే ముఖ్య కారకుడు అని నమ్ముతారు. అంతేకాదు.. ఆయన్ని పండితుడిగా కూడా భావిస్తారట. అయితే కొన్ని కారణాల వల్ల మాత్రమే సీతమ్మను అపహరించి ఆమె పవిత్రతను కాపాడాడని అక్కడి వారు విశ్వసిస్తారు. విచిత్రం ఏంటంటే అక్కడ రావణుడితో పాటు రాముడిని కూడా పూజిస్తారు.

ALSO READ : రామ్‌లీల మైదానంలో రావణుడిపై విల్లు ఎక్కుపెట్టిన ప్రభాస్.. (వీడియో)

Advertisement

Next Story

Most Viewed