- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదే కన్ఫ్యూజన్ ఉంటే ‘ఇండియా’ నెగ్గలేదు : Akhilesh Yadav
భోపాల్: కాంగ్రెస్ టార్గెట్‌గా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ పోల్స్‌లో సమాజ్ వాదీ పార్టీకి సీట్లను కేటాయించే ఆలోచన లేకపోతే.. కాంగ్రెస్ పార్టీ ముందుగానే చెప్పి ఉండాల్సిందన్నారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులు లేవని అకస్మాత్తుగా చెప్పడం ద్రోహం చేయడమే అవుతుందని కామెంట్ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే విధమైన కన్ఫ్యూజన్‌తో ఇండియా కూటమిలోని పార్టీలు బరిలోకి దిగితే బీజేపీని ఓడించడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు.
బీసీలు, మైనార్టీలు, దళితుల (పిఛ్డే, దళిత్, అల్ప్ సంఖ్యాక్ - పీడీఏ) కోసం పనిచేసేందుకు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని అఖిలేష్ వెల్లడించారు. ‘‘ఇండియా కూటమి ఆవిర్భావాని కంటే ముందే సమాజ్ వాదీ పార్టీ ‘పీడీఏ’ ఎజెండాతో ముందుకు సాగుతోంది. పీడీఏ ఎజెండానే ఎన్డీఏను ఓడించగలదు’’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.