Akhilesh Yadav : గడ్కరీకి అఖిలేష్ లేఖ.. హైవేల పనులను వేగవంతం చేయాలని డిమాండ్

by Hajipasha |
Akhilesh Yadav : గడ్కరీకి అఖిలేష్ లేఖ.. హైవేల పనులను వేగవంతం చేయాలని డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ ఎక్స్‌ప్రెస్ వేలు, హైవేలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. రాజస్థాన్‌లోని కోటా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా మధ్య 408.77 కిలోమీటర్ల మేర ‘చంబల్ ఎక్స్‌ప్రెస్‌వే’ పనులను పూర్తి చేయాలని అఖిలేష్ కోరారు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి ఉత్తరాఖండ్ సరిహద్దులోని లిపులేఖ్ ప్రాంతం వరకు ఆరులేన్ల హైవే పనులను పూర్తి చేయాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ వరకు ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేను అనుసంధానించేలా బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను మధ్యప్రదేశ్‌లోని సాత్నా వరకు పొడిగించాలని ఎస్పీ చీఫ్ కోరారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను బిహార్‌లోని బక్సర్ నుంచి భాగల్‌పూర్ వరకు పొడిగించాలన్నారు.

Advertisement

Next Story