Ajit Pawar: ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదంపై చెలరేగిన వివాదం.. అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
Ajit Pawar: ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదంపై చెలరేగిన వివాదం.. అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికల (Maharashtra assembly polls) వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ ఇప్పటికే మహారాష్ట్రలో ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi) చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’ (విడిపోతే, దెబ్బతింటాం) అనే నినాదంపై వివాదం చెలరేగింది. కాగా.. బీజేపీ మహాయుతి కూటమిలో మిత్రపక్షమైన ఎన్సీపీ యోగి నినాదంపై విమర్శలు చేస్తోంది. కాగా.. ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) ఈ నినాదాన్ని ఖండించారు. “నేను ఈ నినాదాన్ని ఆమోదించను. మహారాష్ట్రలో ఈ స్లోగన్ పనిచేయదని పదేపదే చెప్పాను. ఉత్తరప్రదేశ్ లేదా జార్ఖండ్ వంటి ప్రదేశాలలో ఈ ట్రిక్స్ పనిచేస్తాయి. కానీ ఇక్కడకాదు.’’ అని అన్నారు. ఎన్నికల్లో అభివృద్ధి అంశాలపై దృష్టిసారించాలని అజిత్ పవార్ సూచించారు.

హర్యానా ఎన్నికల్లో..

ఇకపోతే యోగి బాటేంగే తో కటేంగం నినాదం హర్యానా ఎన్నికల్లో బలంగా పనిచేసింది. హిందువులు ఐక్యంగా ఉండాలని సూచించడంతో పాటు భారత్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ పరిస్థితిని, బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిని గురించి యోగి ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాటు ఇటీవల కాలంలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు కులగణన పేరుతో హిందువుల్లో విభజన రాజకీయాలు చేస్తున్నాయని యోగి ఆరోపించారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ “ఏక్ హైన్ తో సేఫ్ రహేంగే” (మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే, నవంబర్ 20న మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed