గాజాపై ఇజ్రాయెల్ దాడి.. వంద మంది మృతి

by Shamantha N |
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. వంద మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ టైంలో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. గాజాలోని అల్ సహాబా ప్రాంతంలో ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈదాడిలో దాదాపు వందమంది చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, ఇజ్రాయెల్ మిలిటరీ సెంటర్ మాత్రం హమాస్ కమాండ్ సెంటర్ పై దాడి చేసినట్లు వెల్లడించింది. గత వారంలో గాజాలోని 3 స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇటీవల స్కూల్ పై జరిగిన దాడుల్లోనూ 30 మంది చనిపోయారు. ఆగస్టు 1న స్కూల్ పై జరిగిన దాడిలో 15 మంది చనిపోయారు.

60 వేల మంది వలస

అక్టోబరు 7న హమాస్‌ మిలిటెంట్స్ జరిపిన దాడితో యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు 1,198 మంది పౌరులు చనిపోయారు. అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. గాజాలో ఇప్పటివరకు 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇటీవల జరిగిన హమాస్‌, హెజ్‌బొల్లాల కీలక నేతల హత్యలతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి హ్యూమానిటేరియన్ ఆఫీస్ ప్రకారం గత 72 గంటల్లో కనీసం 60వేల మంది పాలస్తీనియన్లు వెస్ట్రన్ ఖాన్ యూనిస్ వైపు వలస వెళ్లి ఉండొచ్చని యూఎన్ ప్రతినిధి ఫ్లోరిన్సియె సోటోనినో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed