Delhi Air Quality: వెరీ పూర్, సివియర్ కేటగిరీల్లో ఢిల్లీ కాలుష్యం..

by Rani Yarlagadda |   ( Updated:2024-10-29 04:55:21.0  )
Delhi Air Quality: వెరీ పూర్, సివియర్ కేటగిరీల్లో ఢిల్లీ కాలుష్యం..
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో గాలినాణ్యత (Delhi Air Quality) ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది. ఈ నెలలోనే 390కి పైగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పాయింట్స్ నమోదైన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని ప్రాంతాల్లో 400, 480కి పైగా పాయింట్లు నమోదవ్వగా.. అక్కడ వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality index) 304 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. వెరీ పూర్ కేటగిరీ సహా సివియర్ కేటగిరీల్లో వాయు నాణ్యత ఉంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంటవ్యర్థాల దహనం, ఢిల్లీ ఎన్సీఆర్ (NCR)లో వాయువేగం లేకపోవడంతో పాటు పొగమంచు ప్రభావంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికీ ఢిల్లీ ప్రజలు పెరిగిన కాలుష్యంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలినాణ్యత విపరీతంగా పడిపోవడంతో కళ్లు మంటలు, గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. దీపావళి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వం ఈ కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed