మణిపూర్ దేశంలో భాగం కాదనుకుంటున్నారా?: మోడీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్

by Javid Pasha |
మణిపూర్ దేశంలో భాగం కాదనుకుంటున్నారా?: మోడీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ ను దేశంలో లేదని మోడీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. కొన్ని రోజులుగా మణిపూర్ లో అల్లర్లు కొనసాగుతున్నాయని, ఈ అల్లర్లలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. కానీ ఇదేమీ ప్రధాని మోడీకి పట్టడం లేదని అన్నారు. మణిపూర్ లోని పరిస్థితులను తెలుసుకోవడానికి అఖిలపక్షానికి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story