- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీలో ఇండియా కూటమి హవా.. మరో యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లోనే కాషాయ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మాత్రం అధిక సీట్లు వచ్చాయి. దీంతో, కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు యాత్ర చేపట్టడానికి రెడీ అయ్యింది. యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ధన్యవాద్ యాత్ర’ పేరిట కాంగ్రెస్ యాత్రను చేపట్టనుంది. జూన్ 11న ప్రారంభమై 15న యాత్ర ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ప్రజలను కలిసి ధన్యవాదాలు తెలపడమే కాకుండా.. రాజ్యాంగ ప్రతిని ఇచ్చి సన్మానించనున్నారు.
విపక్ష కూటమి హవా
మొత్తం 80 స్థానాలున్న యూపీలో విపక్ష ఇండియా కూటమి 43 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 33 సీట్లకే పరిమితమైంది. సమాజ్ వాదీ పార్టీ 37.. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. ఇకపోతే, 2019 ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లు గెలుచుకోగా.. ఎస్పీ ఒక స్థానం, కాంగ్రెస్ 5 స్థానాల్లోనే గెలుపొందింది.