Vegetable prices : ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు..

by Vinod kumar |
Vegetable prices : ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు..
X

న్యూఢిల్లీ: టమాటా ధర ఒక్కసారిగా పెరగడంతో ప్రజల జేబులకు ఇప్పటికే చిల్లులు పడ్డాయి. తాజాగా పచ్చిమిర్చి, బెండకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తదితర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. మే నెల ప్రారంభం నుంచే కూరగాయల ధరలు అనూహ్యంగా పెరగనారంభించాయి. మే నెల ప్రారంభంలో రూ.40 ఉన్న క్యాలీఫ్లవర్ ధర ఇప్పుడు రూ.60కి చేరుకుంది. రూ.20 ఉన్న బంగాళదుంపలు, ఉల్లిపాయల ధరలు ఇప్పుడు రూ.30కి చేరుకున్నాయి.

క్యాబేజీ ధర రూ.30 నుంచి రూ.60కి ఎగబాకింది. కిలో పచ్చిమిర్చి రూ.300-350కు చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా 30-50% పెరిగాయి. వారం క్రితం రూ.130కి కిలో లభించిన టమాటా ఇప్పుడు రూ.150కు దొరుకుతోంది. అల్లం కూడా కిలో రూ.300 వరకు పలుకుతోంది. వర్షం పడుతున్న కొద్దీ కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయని వర్తకులు వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed