- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొమ్మిదేళ్ల తర్వాత భారత్‌కు పాక్ నాయకుడు
దిశ, డైనమిక్ బ్యూరో: తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్‌కు చెందిన నాయకుడు ఒకరు భారత్‌కు రానున్నారు. మే 4,5 తేదీల్లో గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ-ఎస్ సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్థాన్‌కు విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరుకానున్నారు. ఈ సమదస్సుకు హాజరుకావాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. బిలావల్ భుట్టో జర్దారీని ఆహ్వానించారని పాక్ అధికారులు తెలిపారు. కాగా 2014లో నవాజ్ షరీఫ్ పర్యటన తర్వాత ఆ దేశ నాయకులు భారత్‌కు రావడం ఇదే తొలిసారి అవుతుంది.
2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. దాంతో అప్పటి నుంచి పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జర్దారీ పర్యనట ఆసక్తిగా మారింది.