Putin: కమలా హ్యారిస్‌కు పుతిన్ మద్దతు

by S Gopi |
Putin: కమలా హ్యారిస్‌కు పుతిన్ మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొమాల్డ్ ట్రంప్‌పై వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ పోటీకి నిలిచారు. అయితే, అనూహ్యంగా కమలా హ్యారిస్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు ప్రకటించారు. గురువారం వ్లాదివోస్టాక్‌లో జరిగిన ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్ కార్యక్రమంలో మాట్లాడిన పుతిన్.. ఆమెను చూసినప్పుడు సానుకూలంగా అనిపించింది. ఆమెకు అంతా బాగా జరుగుతుందని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు ఓ ప్రకటనలో పుతిన్ అమెరికా అధ్యక్షుడు బిడెన్‌కు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్వాత బిడెన్ అధ్యక్ష బరి నుంచి తప్పుకోవడంతో తాజాగా పుతిన్ హ్యారిస్‌కు మద్దతుగా మాట్లాడారు. అయితే తుది నిర్ణయం ప్రజలదేనని, ప్రజల ఎంపికను గౌరవించాలని అన్నారు. కమలా హ్యారిష్ సానుకూల వైఖరి రష్యాపై ఆంక్షలు విధించకుండా ఉండొచ్చని పుతిన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story