Drugs: మరికొన్ని మందులు నిషేధించే యోచనలో కేంద్రం

by Shamantha N |
Drugs: మరికొన్ని మందులు నిషేధించే యోచనలో కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆరోగ్యానికి ముప్పుతెచ్చే కారణముందని 34 రకాల మల్టీవిటమిన్ ఔషధాలను నిషేధించే యోచనలో కేంద్రం ఉంది. ఆ ఔషధాలను నిషేధించేందుకు సమీక్ష నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రాలు ఇకపై డ్రగ్ కాంబినేషన్ ను ఆమెదించలేవని వెల్లడించాయి. నిషేధిత ఔషధాల జాబితాలో జుట్టు చికిత్సకు వాడే మందులు, యాంటీపారాసిటిక్ ప్రయోజనాలకు వాడేవి, చర్మ సంరక్షణ, యాంటీ అలెర్టీ మందులు ఉన్నాయి. అయితే, స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్‌ డ్రగ్స్‌ను) కాక్‌టెయిల్‌ డ్రగ్స్‌ అని అంటారు. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) ఔషధాలను వాడడం ప్రమాదకరమని కేంద్రం పేర్కొంది. ఇప్పటికే రోగులకు ముప్పు కలిగే అవకాశం ఉందనే కారణంతో 156 రకాల ఔషధాలను నిషేధించింది.

ఏ మందులపై బ్యాన్ అంటే

నిపుణుల కమిటీ, అపెక్స్ ప్యానెల్, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB).. యాంటీ బాక్టీరియల్ ఔషధాలతో సహా ఈ కాంబినేషన్ డ్రగ్స్ వల్ల ఉపయోగం ఉండదని.. ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని కేంద్రం అంటోంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమైలేస్ + ప్రోటీజ్ + గ్లూకోఅమైలేస్ + పెక్టినేస్ + ఆల్ఫా గెలాక్టోసిడేస్ + లాక్టేజ్ + బీటా-గ్లూకోనేస్ + సెల్యులేస్ + లిపేస్ + బ్రోమెలైన్ + జిలానేస్ + హెమిసెల్యులేస్ + మాల్ట్ డయాస్టేజ్ + ఇన్వెర్టేజ్ + పాపైన్ నిషేధిత జాబితాలో ఉంది. మెఫెనామిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్ మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని నిషేధం విధించారు. ఎర్గోటమైన్ టార్ట్రేట్ + కెఫిన్ + పారాసెటమాల్ + ప్రోక్లోర్‌పెరాజైన్ మెలేట్ నిషేధిత జాబితాలో ఉన్నాయి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26A కింద నిషేధం జారీ చేశారు. హానికరం లేదా అనవసరమైనదిగా భావించే ఔషధాల తయారీ, అమ్మకం, పంపిణీని నిషేధించడానికి ఇది ప్రభుత్వానికి అనుమతిస్తుంది. ఈ మేరకు ఈ నెల 12న నోటిఫికేషన్‌ విడుదలైంది.

Advertisement

Next Story

Most Viewed