ఢిల్లీ: కవితకు తెల్లవారుజామున 3 గంటల వరకు ఇంజెక్షన్లు

by GSrikanth |   ( Updated:2024-04-05 11:26:05.0  )
ఢిల్లీ: కవితకు తెల్లవారుజామున 3 గంటల వరకు ఇంజెక్షన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్ అధికార దుర్వినియోగం అని అన్నారు. సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ పెండింగ్‌లో ఉందని చెప్పారు. గతంలోనూ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారని గుర్తుచేశారు. ‘ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగోలేదు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఇంజెక్షన్లు తీసుకున్నారు. ఆమె బీపీ గతంలో ఎన్నడూ లేనంత అసాధారంగా ఉంది. ఆమె మెడికల్ రిపోర్టులు ఇంకా మాకు వైద్యులు ఇవ్వలేదు’ అని న్యాయవాది పేర్కొన్నారు. కాగా, నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో కవిత నివాసంలో సుదీర్ఘ సోదాల అనంతరం ఆమెకు నోటీసులు ఇచ్చారు. అనంతరం అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. కాగా, ఈడీ కోర్టుకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా వచ్చారు.

Read More : కవిత అరెస్ట్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి వీడియో

Advertisement

Next Story