- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ వాయిదా: ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వరుస సమన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై బుధవారం జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు వరుస సమన్లు జారీ చేయడంపై సమాధానం ఇవ్వాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. సమాధానం ఇచ్చేందుకు రెండు వారాలు గడువు విధించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని కేజ్రీవాల్‌ను సైతం ప్రశ్నించింది. దీనికి కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బదులిస్తూ..కేజ్రీవాల్ ఎక్కడికీ పారిపోవడం లేదని తెలిపారు. కానీ బలవంతపు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తే తప్పకుండా విచారణకు హాజరవుతారని చెప్పారు. కాగా, ఈడీ కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తొమ్మిది సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే అన్ని నోటీసులను తిరస్కరించిన కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరయ్యారు.