- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Accident: యూపీలో బైక్‌ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన బొలెరో.. వ్యక్తి మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ (Utharapradesh) లోని సంభాల్(Sambhal)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొలెరో బైకును ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో వ్యక్తి మృతి చెందాడు. షాజాద్ ఖేడా గ్రామానికి చెందిన సుఖ్‌వీర్ (50) అనే వ్యక్తి హయత్‌నగర్ నుంచి తన ఇంటికి తిరిగి వస్తుండగా వాజిద్ పురం సమీపంలోని హైవేపై బొలెరో అతని బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం ఆయన కిందపడగా సుమారు ఒక కిలోమీటర్ దూరం అలాగే బాధితుడిని ఈడ్చుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన సుఖ్‌వీర్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని, పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే బొలెరో వాహనానికి బీజేపీ స్టిక్కర్ వేసి ఉండటం గమనార్హం.