- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AAP : ముంబైలోని మొత్తం 36 అసెంబ్లీ సీట్లలో ఆప్ పోటీ
దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కసరత్తు మొదలుపెట్టినట్లు వెల్లడించింది. ముంబై పరిధిలోని మొత్తం 36 అసెంబ్లీ స్థానాల్లోనూ ఆప్ పోటీ చేస్తుందని ఆ పార్టీ ముంబై విభాగం అధ్యక్షురాలు ప్రీతీశర్మ మీనన్ తెలిపారు. అనతికాలంలోనే జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలను విస్తరిస్తుందని చెప్పారు.
గత పదేళ్ల వ్యవధిలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం దేశమంతా కొనియాడే స్థాయిలో అభివృద్ధి పనులు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆ తరహా అభివృద్ధి సాధ్యమైతే మహారాష్ట్రలో మాత్రం ఎందుకు సాధ్యం కాదని ప్రీతీశర్మ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని సీఎం ఏక్‌నాథ్ షిండే సర్కారు అవినీతిఊబిలో కూరుకుపోయిందని ఆమె విమర్శించారు. రాష్ట్ర ఖజానాను దోపిడీ చేయడమే షిండే ప్రభుత్వం లక్ష్యమని ఆరోపించారు. ప్రస్తుత బాధల నుంచి మహారాష్ట్రకు విముక్తి కల్పించే సత్తా ఆప్‌కు ఉందన్నారు.