AAP: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

by Ramesh Goud |
AAP: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(AAP Convenor Aravind Kejriwal) ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పూర్వంచల్ ప్రజలపై(Poorvanchal People) కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల పై నిరసనగా బీజేపీ(BJP) ఆధ్వర్యంలో పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్(Poorvanchal Samman March) పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు పలు నినాదాలు చేసుకుంటూ.. ఫిరోజ్ షా రోడ్డులోని కేజ్రీవాల్ ఇంటి వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ వాదులు.. పూర్వాంచల్ ప్రజలపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు సరికాదని, ఆయన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని, పూర్వాంచల్ వాసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతూ వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగి, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టేందుకు వాటర్ స్ప్రేయర్ లను ఉపయోగించారు. అనంతరం పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed