గుడ్ న్యూస్.. ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

by Ramesh N |
గుడ్ న్యూస్.. ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆధార్ కార్డు ఉన్నవారికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరోసారి శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డు అప్డేట్ గడువును మరోసారి పొడిగించింది. ఈ క్రమంలోనే అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2024 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డు లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. మై ఆధార్ పోర్టల్‌ల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని సూచించింది. దేశ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరింది.

మరోసారి అవకాశం

కాగా, ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లకి పైగా ఉంటే వివరాలను అప్డేట్ చేసుకోవాలని గతంలో సంస్థ తెలిపిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు పదేళ్లకు ఒక సారి తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి. ఇంతకు ముందు 2024 మార్చి 14 వరకు ఆధార్ కార్డు ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువు నిర్ణయించింది. తాజాగా ఆ గడువును పొడిగించింది. ఈ క్రమంలోనే మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు మరోసారి అవకాశం ఇచ్చింది. ఆధార్ అప్ డేట్ వల్ల వ్యక్తుల డేటా అక్యురేట్‌గా ఉంటాయి.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు అప్డేట్..

యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ uidai.gov.inలోకి లాగిన్ కావాలి. ఆధార్ కార్డులోని ఫోటో, వేలి ముద్రలు, ఐరిస్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఇంటి పేరు వంటి వివరాలను బయోమెట్రిక్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. డెమొగ్రాఫిక్ వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఫోటోగ్రాఫ్, ఐరిస్ లాంటి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడానికి దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి పోవాల్సి ఉంటుంది. అప్డేట్‌కు ఆధార్ కేంద్రాల్లో దాదాపు రూ. 50 ఫీజు చెల్లించవలసిన విషయం తెలిసిందే. అప్డేట్ విషయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్ 1947 కు కాల్ చేయాలని యూఐడీఏఐ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed