Crime News: కోల్‌కతా ఘటన మరవక ముందే బెంగుళూరులో యువతిపై లైంగిక దాడి

by M.Rajitha |
Crime News: కోల్‌కతా ఘటన మరవక ముందే బెంగుళూరులో యువతిపై లైంగిక దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా లో ట్రైనీ డాక్టర్ మెడ జరిగిన దారుణం మర్చిపోక ముందే కర్ణాటక రాజధాని బెంగుళూరులో మరో దారుణం జరిగింది. బెంగుళూరు నగరంలోని రమంగళలో తన స్నేహితులను కలవడానికి వెళ్లిన యువతి తిరిగి వస్తూ.. ఇంటికి వెళ్లేందుకు ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. ఆ యువతికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్ హెబ్బాగోడీ ప్రాంతానికి రాగానే యువతిని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుండి ఇంటికి చేరుకున్న యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుని కోసం గాలిస్తున్నామని తెలియ జేశారు.

Next Story

Most Viewed