మోడీ కాన్వాయ్ మీదకు దూసుకొచ్చిన యువకుడు.. షాక్ తిన్న సెక్యూరిటీ సిబ్బంది

by Javid Pasha |   ( Updated:2023-03-25 15:30:29.0  )
మోడీ కాన్వాయ్ మీదకు దూసుకొచ్చిన యువకుడు.. షాక్ తిన్న సెక్యూరిటీ సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం ప్రధాని మోడీ కర్ణాటకలోని దేవనాగరి జిల్లాలో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. అయితే ఓ యువకుడు బారీకేడ్లను దాటుకుంటూ మోడీ కాన్వాయ్ మీదకు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుని లాగిపారేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కొప్పాల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా ఆ యువకుడిని పోలీసులు గుర్తించారు. కాగా ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం కనబడటం ఇది రెండోసారి. గతేడాది హుబ్బలి జిల్లాలో పీఎం మోడీ పర్యటించినప్పుడు కూడా భద్రతాలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది.

Advertisement

Next Story