నడిరోడ్డుపై చీర విప్పి ఐదుగురి ప్రాణాలు కాపాడిన మహిళ

by sudharani |
నడిరోడ్డుపై చీర విప్పి ఐదుగురి ప్రాణాలు కాపాడిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎదుటి వ్యక్తి ప్రాణాలు పోతున్నాయంటే మనకేంటి సంబంధం అన్నట్లు వెళ్లిపోతుంది నేటి సమాజం. లేదా.. వారు ఎలా చనిపోతున్నారా అని ఫోన్‌లలో వీడియోలు తీస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం నడి రోడ్డుపై తన చీరను విప్పి మరీ ఐదుగురి ప్రాణాలను కాపాడింది. వివరాల్లోకి వెళితే..

బెంగళూరు-KR కూడలిలోని అండర్ పాస్ వద్ద భారీ వరదలో కారులో చిక్కుకున్న ఐదుగురి ప్రాణాలను ఓ మహిళ తన చీరతో కాపాడారు. నీటిలో చిక్కుకున్న ఆరుగురిని కాపాడేందుకు, వారిని బయటకు లాగేందుకు తాడు కావాల్సి వచ్చింది. చుట్టూ చాలా మంది ఉన్న ఎవరూ స్పందించలేదు. దీంతో మహిళ తన చీరను విప్పి వరదలో చిక్కుకున్న వారికి ఇచ్చింది. ఆ చీరను ఇనుప ఊచలకు కట్టి వారిని కాపాడింది. అయితే ఆరుగురిలో అప్పటికే ఏపీకి చెందిన భానురేఖ అనే యువతి మృతి చెందింది.

Advertisement

Next Story