శిక్షణ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. జస్ట్ మిస్ అంతే...!

by Shiva |   ( Updated:2023-05-30 06:56:49.0  )
శిక్షణ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. జస్ట్ మిస్ అంతే...!
X

దిశ, వెబ్ డెస్క్ : సాంకేతిక లోపంతో పైలట్, ట్రైనీ పైలట్‌తో వెళ్తున్న రెడ్‌బర్డ్ శిక్షణా విమానం కర్నాటకలోని బెలగావిలోని వ్యవసాయ క్షేత్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలు కాగా, వారిని సమీపంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. శిక్షణా విమానం, పైలట్ మరియు ట్రైనీ పైలట్‌తో ఉదయం 9:30 గంటలకు బెలగావిలోని సాంబ్రా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అయితే, గాలిలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో బెలగావిలోని హోన్నిహాల గ్రామం వద్ద వ్యవసాయ పొలంలో దిగింది. ఇది బెలగావిలోని విమాన శిక్షణా కేంద్రంలో ట్రైనీలకు శిక్షణనిచ్చే విమానం. సమాచారం అందుకున్న ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, శిక్షణ పాఠశాల అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Next Story