కారు బానెట్‌పై పెళ్లికూతురు డ్రస్‌లో యువతి ఫోటో షూట్!

by Vinod kumar |
కారు బానెట్‌పై పెళ్లికూతురు డ్రస్‌లో యువతి ఫోటో షూట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా మోజు ఓ యువతికి చిక్కులు తెచ్చిపెట్టింది. లైకులు, షేర్లు, కామెంట్ల పిచ్చి కోసం చేసిన ఓ చిన్న పని ఆమెపై పోలీలు చర్యలు తీసుకునే వరకు వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లోని సివిల్ లైన్ ఏరియాకు చెందిన వర్ణిక అనే యువతి ఇటీవల సఫారీ లగ్జరీ కారు బానెట్ పై కూర్చుని బాలీవుడ్ పాటకు ఫోజులిచ్చింది.

అచ్చం పెళ్లికూతురులా అలంకరించుకుని ఫోటో షూట్ చేసింది. ఇందుకు సంబంధించిన రీల్ ను ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ట్రాఫిక్ పోలీసుల కంట పడింది. దీంతో ఆ వీడియోలో ఉన్న కారు నెంబర్ ఆధారంగా ఆమె వివరాలు సేకరించి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను రూ.16,500 జరిమానా విధించారు.

Advertisement

Next Story