కాలేజీల్లో కొత్త రూల్.. ఇకపై చిరిగిన జీన్స్, టీ షర్ట్ బ్యాన్

by Indraja |
కాలేజీల్లో కొత్త రూల్.. ఇకపై చిరిగిన జీన్స్, టీ షర్ట్ బ్యాన్
X

దిశ వెడ్ డెస్క్: ప్రపంచ దేశాలు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయుల వస్త్రధారణను విదేశీలు ఇష్టపడుతున్నారు. కాని భారతీయులకు మాత్రం స్వదేశి వస్త్రధారణ రుచించడం లేదు. పాశ్చ్యాత సంస్కృతి మోజులో తమ వస్త్రధారణను ధారుణంగా మార్చు్కుంటున్నారు. చినిగిన ధుస్తులను కుట్టుకుని ధరించే రోజులుపోయి, బాగున్న దుస్తులను చించుకుని ధరించే రోజులు వచ్చాయి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పలువురు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా కాళాశాల విద్యార్థి విద్యార్థినిల వస్త్రధారణ చూస్తే జిగుప్సాకరంగా ఉందని పలువు అధ్యాపకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కనుమరుగవుతున్న భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించేందుకు ఓ కళాశాల నడుంభిగించింది. ఇకపై పిచ్చిపిచ్చి వస్త్రాలతో కళాశాలకు వస్తే అనుమతించమని తేల్చి చెప్పింది. ఈ ఘటన దేశ వాణిజ్య రాజధానిగా, ఫ్యాషన్‌కి కైరాఫ్‌ అడ్రస్‌గా పేరుగాంచిన ముంబై నగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఆచార్య, మరాఠే కళాశాల యాజమాన్యం కాలేజీలో కొత్తరూల్ తీసుకువచ్చింది. ఇకపై కాలేజీకి ఎలా రావాలో వివరిస్తూ డ్రెస్ కోడ్‌కు సంబంధించిన నోటిఫికేఫన్‌ను గత నెలలో కళాశాల యాజమాన్యం విడుదల చేసింది.

ఆ నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

కళాశాలకు చిరిగిన జీన్స్, టీ షర్టులు, జెర్సీలు వంటి శరిరాన్ని భహిర్గతం చేసే వస్త్రాలను ధరించి వచ్చిన వారికి కళాశాల లోపలికి అనుమతి లభించదు.

కేవలం ఫార్మల్, డిసెంట్ డ్రెస్‌లో వచ్చిన వారికే లోపలికి అనుమతి ఉంటుంది.

యువతులు భారతీయ పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చు. అయితే మతపరమైన, సాంస్కృతిక అసమానతలను ప్రతిభింబిచే వస్త్రాలకు అనుమతి లేదు. అలానే క్యాప్, బ్యాడ్జ్, హిజాబ్, బుర్ఖా, స్టోల్, నకాబ్ వంటివాటిని కళాశాలలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న సాధారణ గదుల్లో తొలిగించిన రావాలి. అప్పుడే కాలేజీ లోపలికి ప్రవేశం ఉంటుంది.

అయితే ఈ నోటిఫికేఫన్ విడుదలైనా విద్యార్థి, విద్యార్థనిలు పట్టించుకోలేదు. ఎప్పటిలానే నచ్చినట్టుగా కాలేజీకి వచ్చారు. దీనితో కళాశాల యాజమాన్యం వాళ్లను లోపలికి అనుమతించలేదు. దీనితో కళాశాల బయట ఉద్రిక్తత చోటు చేసుకుంది.

యజమాన్యం అలా.. విద్యార్థులు ఇలా..

అడ్మిషన్ల సమయంలో ఇలాంటి రూల్స్ ఏం చేప్పకుండా ఇప్పుడు ఇలా డ్రెస్ కోడ్ పెట్టడం ఏంటని కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం అడ్మిషన్ల తీసుకున్నప్పుడే విద్యార్థలకు కాలేజీ రూల్స్‌ గురించి, వస్త్రధారణ గురించి చెప్పామని, అయితే విద్యార్థులు ఎందుకు వాళ్లకు ఏం తెలియదంటూ ఆంధోళన చేస్తున్నారో తమకు అర్థంకావడం లేదని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed