- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
18 లక్షల కారును గాడిదలకు కట్టి ఊరేగింపు.. కస్టమర్ వినూత్న నిరసన!
దిశ, డైనమిక్ బ్యూరో: కొన్ని సందర్భాల్లో భారతీయుల నిరసనలు విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఓ కస్టమర్ వెరైటీ నిరసన తెలిపి హ్యూండాయ్ కంపెనీకి షాకిచ్చారు.రెండు నెలల క్రితం రూ. 18 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కారును గాడిదలతో లాగుతూ షో రూమ్‌కు తీసుకువచ్చాడు. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు యజమాని శంకర్‌లాల్ తెలిపిన వివరాల ప్రకారం.. క్రెటా కారును మద్దిలోని రామ్‌జీ హ్యుందాయ్ షోరూమ్ నుంచి రెండు నెలల క్రితం కొనుగోలు చేశారు. అయితే కొద్ది రోజుల్లోనే కారులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కారు స్టార్ట్ కూడా కాలేదు. దీనిపై రాజ్‌కుమార్ షోరూమ్‌లోని ఉద్యోగులను పలుమార్లు సంప్రదించాడు. కానీ అతని సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. అలాగే సహకరించలేదు. షోరూమ్ సిబ్బంది తీరుపై అసహనం చెందిన శంకర్ లాల్ వెరైటీ నిరసనకు దిగారు.
తరచూ పాడవుతున్న కారును రెండు గాడిదలకు కట్టి బాజాభజంత్రీలతో ఊరేగింపుగా షోరూమ్‌కు తీసుకు వచ్చాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భారతీయులతో ఎప్పుడు గొడవ పడకండి అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే శంకర్ లాల్ ఆరోపణలను షోరూమ్ కొట్టిపారేస్తోంది. కారు యజమాని వాహనానికి కంపెనీకి సంబంధించినవి కాకుండా బయటి నుంచి తెచ్చిన లైట్లు అమర్చాడని. ఇది కంపెనీ నిబంధనలకు విరుద్ధం. దీంతో కారు ఫ్యూజ్ ఎగిరిపోయింది. అందుకే కారు స్టార్ట్ కావడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఈ వ్యవహారం మాత్రం వైరల్‌గా మారింది. అయితే కారుకు గాడిదను కట్టి లాగిన ఘటన ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక మంది సర్వీస్ విషయంలో చిర్రెత్తిపోయి తమ ఖరీదైన కార్లను గాడిదలకు కట్టి లాగించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.