Crime News: పూణెలో దారుణం.. ప్రియురాలి కోసం భార్యను హత్య చేసిన భర్త

by Javid Pasha |   ( Updated:2022-11-24 13:34:12.0  )
Crime News: పూణెలో దారుణం.. ప్రియురాలి కోసం భార్యను హత్య చేసిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియురాలి మోజులో ఓ భర్త కట్టుకున్న భార్యను హత్య చేసిన ఘటన పూణెలో జరిగింది. ఇన్స్ పెక్టర్ మనోజ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్వాప్నిల్ సావంత్ అనే వ్యక్తి పూణెలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో మేల్ నర్స్ గా పని చేస్తున్నాడు. అతడికి ప్రియాంక క్షేత్రే అనే అమ్మాయితో 5 నెలల కిందట వివాహమైంది. అయితే స్వాప్మిల్ తను పని చేస్తున్న హాస్పిటల్ లోనే ఓ నర్స్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇరువురు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి సిద్దపడ్డారు. ఈ క్రమంలోనే స్వాప్నిల్ తన భార్య అడ్డును తొలగించుకోవాలనుకున్నాడు. నవంబర్ 14న తన భార్యకు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. మళ్లీ ఏం తెలియనట్లు ఆమెను హాస్పిటల్ కు తీసుకొచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించిందని డ్రామాలాడాడు. అయితే అప్పటికి ఆమె చనిపోయినట్లు డాక్టరు ప్రకటించారు.

అయితే భర్తపై అనుమానం వచ్చిన పోలీసులు.. అతడిపై నిఘా పెట్టారు. ఆ నేపథ్యంలోనే వాళ్లకు మృతురాలు ప్రియాంక రాసిన సూసైడ్ నోట్ లభించింది. దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. స్వాప్నిల్ ను తమదైన శైలిలో విచారించారు. దీంతో ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి తానే తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. తన భార్యను చంపడానికి హాస్పిటల్ నుంచి డ్రగ్స్, ఇంజెక్షన్లు దొంగిలించానని, వాటితోనే తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలిసులు హత్య, గృహ హింస, వరకట్న వేధింపుల చట్టం కింద కేసు పెట్టి కోర్టుకు తరలించారు.

Advertisement

Next Story