Gift Deed : గిఫ్టు డీడ్‌ రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Hajipasha |
Gift Deed : గిఫ్టు డీడ్‌ రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : గిఫ్టు డీడ్‌ (బహుమాన పత్రం/ఒప్పందం)కు సంబంధించిన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పును వెలువరించింది. గిఫ్టు డీడ్‌‌(Gift Deed)ను అంత అవలీలగా రద్దు చేయలేమని స్పష్టం చేసింది. రద్దు చేసే వెసులుబాటును కల్పించే నిబంధనలు, సందర్భాలపై గిఫ్టు డీడ్‌‌లో స్పష్టమైన ప్రస్తావన ఉంటేనే ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. కేవలం గిఫ్టు డీడ్‌ను రాయించిన వ్యక్తి వైఖరి ఆధారంగా, దాని రద్దుపై నిర్ణయం తీసుకోలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. గిఫ్టు డీడ్‌ను రాసిన వ్యక్తి, దాన్ని పొందిన వ్యక్తి పరస్పర అంగీకారంతో పొందుపర్చిన నిబంధనలు, సందర్భాల ఆధారంగా మాత్రమే రద్దు చేసే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది.

గిఫ్టు డీడ్‌లో భాగంగా 1983లో తమిళనాడులోని కడలూరు జిల్లాలో 3750 చదరపు అడుగుల స్థలాన్ని తమిళనాడు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకు బదలాయించారు. అయితే ఆ భూమిని రికవరీ చేయాలంటూ గతంలో ఆ భూమితో సంబంధమున్న ఎన్.తాజుద్దీన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే దాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో అతడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. హైకోర్టు తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్దించింది. ఆ గిఫ్టు డీడ్‌ను రద్దు చేయలేమంటూ తీర్పును వెలువరించింది.

Advertisement

Next Story

Most Viewed