ఈ నెయ్యి ఖరీదు కేజీ రూ.2 లక్షలు. ఎందుకత స్పెషల్ తెలుసా?

by Javid Pasha |
ఈ నెయ్యి ఖరీదు కేజీ రూ.2 లక్షలు. ఎందుకత స్పెషల్ తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ వంటిట్లో నెయ్యి అనేది అవసరమైన పదార్థం. కొంతమంది అయితే నెయ్యి ఎక్కువగా వాడుతూ ఉంటారు. బిర్యానీ, స్వీట్లు లాంటి వాటిని తయారు చేయాలంటే నెయ్యి ఉండాల్సిందే. మాములుగా మార్కెట్‌లో నెయ్యి కొనుగోలు చేయాలంటే కేజీ రూ.500 నుంచి దొరుకుతుంది. అయితే గుజరాత్‌లోని ఈ నెయ్యి మాత్రం రూ.2 లక్షల వరకు పలుకుతుంది. అంత రేటు ఎందుకంటే..

ఈ నెయ్యిలో మూలికలను కలుపుతున్నారు. కుంకుమ పువ్వు, గులాబీ రేకులు, మందారాలు, పిప్పళ్లు, పసుపు వంటి మూలికలను కలుపుతారట. దాని వల్ల కేజీ ధర రూ.3 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఈ నెయ్యిని చర్మానికి రాసుకుంటే అనేక వ్యాధులు తగ్గిపోతాయట. తలనొప్పి, మెటిమలు, నల్లమచ్చలు, చర్మవ్యాధులు దూరమవుతాయట. దీంతో ఈ నెయ్యిని కొనుగోలు చేసేందుకు చాలామంది ముందుకొస్తున్నారు. ఇక్కడ నుంచి ఇతర దేశాలు కూడా నెయ్యిని రైతు డెలివరీ చేస్తున్నారు.

గుజరాత్‌లోని రమేష్ భాయ్ రూపరేలియా అనే రైతు గోశాలను నడుపుతున్నాడు. స్వచ్ఛమైన ఆవుపాలతో నెయ్యి తయారుచేస్తోన్నాడు. ఈ నెయ్యిలో మూలికలు కలిపి అనేక రకాల ఉత్పత్తులు తయారుచేస్తోన్నాడు. అమెరికా, కెనడా, సౌదీ అరేబియా లాంటి దేశాలకు కూడా నెయ్యిని పంపుతున్నాడు. దీని ద్వారా ఈ రైతు రూ.కోట్లలో సంపాదిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed