- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్‌లో తాగి నడిరోడ్డుపై యువతి హంగామా.. తాగిన మత్తులో ఆ పని చేసింది?
దిశ, డైనమిక్ బ్యూరో: మద్యపానం నిషేధం ఉన్న గుజారత్‌లో బాగా తాగి నడిరోడ్డుపై యువతి వీరంగం సృష్టించింది. తాగిన మత్తులో స్కూటీకి నిప్పు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజ్‌కోట్-కలవాడ్ రోడ్డులోని ప్రభుత్వ క్వార్టర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. తన యాక్టివా డ్యామేజ్ అయిందని, డబ్బులు డిమాండ్ చేస్తూ కొంత మందితో యువతి వాగ్వాదానికి దిగింది.
ఈ క్రమంలోనే యువతి తన స్కూటీని కింద పడేసి.. స్కూటీకి ఉన్న పెట్రోల్ మూత తీసి నిప్పు పెట్టింది. దీంతో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఈ తతంగాన్ని అక్కడున్న వ్యక్తులు తమ కెమెరాల్లో రికార్డ్ చేశారు. యువతి మద్యం మత్తులో ఉందని, దీంతో తాగిన మత్తులోని యువతి అలా చేసిందని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వం, యువతిపై ఫైర్ అవుతున్నారు. గుజరాత్‌లో కేవలం కాగితాలపైనే మద్యపానం నిషేధం ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు.