ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ చక్కర్లు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

by Javid Pasha |   ( Updated:2023-07-03 03:59:36.0  )
ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ చక్కర్లు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసంపై సోమవారం వేకువజామును ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ప్రధాని భద్రతా సిబ్బంది ఉలిక్కిపడింది. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? అనే కోణంలో ఎస్పీజీ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు డ్రోన్ ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కాగా ప్రధాని భద్రతా వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Next Story