స్థానబలమున్నా..ఏమరపాటుకు చిరుత నోట చిక్కిన మొసలి

by Y. Venkata Narasimha Reddy |
స్థానబలమున్నా..ఏమరపాటుకు చిరుత నోట చిక్కిన మొసలి
X

దిశ, వెబ్ డెస్క్ : స్థానబలముంది కదా అని ఏమరపాటుగా ఉంటే ఎంతటి బలమున్నా..శతృవు చేతచిక్కక తప్పదనడానికి నిదర్శనమే ఈ చిరుత..మొసలి ఘటన. నీళ్లలో ఉన్న మొసలి బలానికి మత్త గజమైనా...సింహరాజమైనా దాసోహామే. ఇందుకు గజేంద్ర మోక్షం పురాణ కథ కూడా నిదర్శనం. అయితే నీళ్ళలో స్థానబలముంది కదా అని ఏమరపాటుగా ఉన్న ఓ మొసలి అనూహ్యంగా చిరుత నోటికి ఆహారమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ మొసలి నది నీళ్లలోని చేపను నోట కరుచుకుని తీరిగ్గా తింటుంది. అదే సమయంలో అదే నది ఒడ్డున పొదల్లో ఆకలితో వేట కోసం మాటు వేసిన చిరుత పులి నీళ్లలో చేపను తింటున్న మొసలిని చూసింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో నీటిలోకి దూకి, మొసలిని నోట కరుచుకుని ఒడ్డుపై ఉన్న పొదల్లోకి లాక్కెళ్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోతుంది.

ఆ సమయంలో అక్కడే ఉన్న పర్యాటకులు..ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు చిరుత పులి, మొసలి వ్యవహారంపై రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. చిరుత వేగం ముందు మొసలి స్థాన బలం ఓడిందని కొందరు..చేపను తింటూ ఏమరపాటుగా ఉండటంతోనే చిరుతకు మొసలి చిక్కిందని మరోకరు..చిన్న చేపను పెద్ద చేప తిన్నదని మరోకరు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed