300 అడుగుల లోతైన బోరుబావిలో పడిన చిన్నారి.. కొనసాగుతోన్న రెస్య్కూ ఆపరేషన్!

by Anjali |
300 అడుగుల లోతైన బోరుబావిలో పడిన చిన్నారి.. కొనసాగుతోన్న రెస్య్కూ ఆపరేషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సెహూర్ జిల్లాలోని ముంగోలి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. శ్రీస్తి కుష్వాహా అనే బాలిక మంగళవారం మధ్యాహ్నం పొలంలో ఆడుకుంటూ.. తెరిచి ఉంచిన 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారిని క్షేమంగా బయటకు తీయ్యడానికి అధికారులు, రెస్క్యూ సిబ్బంది మంగళవారం సాయంత్రం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. బోరుబావికి సమాంతరంగా అధికారులు లోతైన గుంతను తవ్వుతున్నారు.

బోరుబావి లోతు దాదాపు 300 అడుగులు ఉంటుందని, 20 అడుగుల లోతులో తను కూరుకుపోయిందని, మరింత కిందకు జారిపోయి 50 అడుగుల లోతుకు కూరుకుపోతుందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు సమయం గడుస్తున్న కొద్ది శ్రీస్తి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రాంతంలో రాతి నేల ఉండడం వల్ల సహయక చర్యలకు సమయం ఎక్కువ పడుతోందని, చిన్నారికి ఆక్సిజన్ అందిస్తున్నామని, వీలైనంత త్వరగా బాలికను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని సెహూర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story