ప్రధాని మోడీ గత జన్మలో ఛత్రపతి శివాజీ మహారాజ్.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు దుమారం

by Ramesh N |
ప్రధాని మోడీ గత జన్మలో ఛత్రపతి శివాజీ మహారాజ్.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు దుమారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ లోక్‌సభలో ప్రధానిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీసింది. పురోహిత్ ఒక సాధువుతో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సాధువు తన గత జన్మలో ప్రధాని మోడీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పాడని సాధువు వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు. బార్‌గఢ్ ఎంపీ ప్రదీప్ పురోహిత్ తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశంలో భాగంగా లోక్‌సభలో ప్రసంగిస్తూ.. గత జన్మలో ప్రధాని మోడీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఓ సాధువు తనకు చెప్పినట్లు గుర్తుకు చేశారు. ప్రధాని మోడీ నిజంగా శివాజీ మహారాజ్ అని, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి ఆయన పునర్జన్మ పొందారని ఎంపీ నొక్కి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాంగ్రెస్ నేతలు, నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. ఛత్రపతి శివాజీతో ప్రధాని మోడీని పోల్చడం కరెక్ట్ కాదని, శివాజీ మహారాజ్‌ను అవమనించడమేనని చెప్పారు.

Next Story